స్పీకర్ తమ్మినేనితో మర్యాదపూర్వక కలయిక
గౌరవ స్పీకర్ తమ్మినేని సీతారాం గారిని మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించిన మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు
కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడి చికిత్స పొంది కరోనా నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారు.
కాగా నేడు విజయవాడలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హాజరైన గౌరవ స్పీకర్ తమ్మినేని సీతారాం గారిని తన పేషీలో కలిసి యోగక్షేమాలను తెలుసుకొన్నారు రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్సశాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు.
