బిజెపి ఆధ్వర్యంలో మాస్క్ లు పంపిణీ..
మండపేట: సేవాహి సంఘటన్ సేవే పరమార్ధం కోవిడ్ సమయంలో పేదలకు సేవ చేయాలన్న ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు గురువారం భారతీయ జనతా పార్టీ మండపేట నియోజకవర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో పేకేటిపాకలు గ్రామంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు బొక్క రాంబాబు అధ్యక్షతన మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధిహామీ కూలీలకు మజ్జిగ పేకెట్లు, మాస్క్ లు సుమారు వందమందికి పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ ఈ పధకం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖచే రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా గుర్రపుడెక్క, కలుపుతీయడం, చెరువులు పూడిక తీయడం ద్వారా నీరు పూర్తిస్ధాయిలో చివారు చేలకు అందేలా ఉపయోగపడే పదకం అని అన్నారు.
ఈ పధకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో కూలీలకు, జాబ్ కార్డు ఉన్న ప్రతి వయోజనుడికి, వలసకూలీలు ఉపాధి పొందవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం మండల అద్యక్షులు తోరం రాము, జక్కా లక్ష్మీనారాయణ, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, మట్టపర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.