విశాఖలో నిత్య పెళ్ళికొడుకుగ మారిన అరుణ్ కుమార్ అరచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి.
ఇతగాడి ఆగడాలను భరించలేని బాధిత మహిళలు మహిళా చేతనను ఆశ్రయించారు.
ఈ కీచకుడి చరనుండి వారిని ఎలాగైనా కాపాడాలని బాధిత మహిళలకు అండగా నిలిచి సదరు వ్యక్తి ఆగడాలను మహిళా చేతన బయట పెట్టింది.
ఇప్పటివరకు ఎనిమిది మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో పెళ్ళి చేసుకుని అపై వ్యభిచారం చేయ్యాలంటు ఓత్తిడి చేస్తూ వేధింపులకు గురిచేసేవాకు.
అరణ్ కుమార్ ఆగడాలు అంతటితో ఆగలేదని, గంజాయి, వ్యభిచార ముఠాలతో కూడా సంబంధాలు కలిగి ఉన్నట్లు విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియాలో సంస్థ ప్రదాన కార్యదర్శి కత్తి పద్మ ఆరోపించారు.
మొదటి భార్య కూమార్తెను వ్యభిచార ముఠాకు అమ్ముతానంటు వేధింపులకు గురిచేస్తున్నసడని, మాట వినకపోతే తుపాకీ కత్తులతో బెదిరింపులకు దిగుతున్నాడని, కంచరపాలెం పోలీసులను ఆశ్రయించిన బాధితులకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా సంఘాలను ఆశ్రయించినా లాభం లేదని బాధిత మహిళలు అరుణ్ కుమార్ కు పోలీసుల కు స్నేహ సంభదాలు ఉన్నాయంటూ మహిళ ఆరోపించారు.
ఈ విషయమై వెంటనే బాధిత మహిళలకు న్యాయం చేయాలని కత్తి పద్మ డిమాండ్ చేశారు.
ఇకనైనా ఇలాంటి వారి నుండి మహిళలను కాపాడాలని పత్రికా ముఖంగా కోరారు.