అశ్వాపురం:- మండలం మొండి కుంట గ్రామంలో కబ్జా జరిగిన భూమి విషయంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న గుడూరిమల్లారెడ్డి కుటుంబానికి న్యాయం చేయాలని మండలంలొని అధికార అఖిల పక్ష పార్టీలు తహసీల్దార్ కు సి ఐ సట్లరాజుకు మెమోరండం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని లేని పక్షంలో పార్టీ లకు అతితంగా పెద్ద ఎత్తున ఆందోళన చెపడుతిమని అధికారులకు తెలియజేశారు.
మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపి అధికార అఖిల పక్షం పార్టీల హామీతొ 3రోజులుగా ఉన్న మల్లారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పింపించిన కుటుంబ సభ్యులు.
ఈకార్యక్రమంలో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి. యంపిపి ముత్తినేనిసుజాత, కొడి అమరేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె కేశవరెడ్డి, సి పి ఐ నాయకులు అనంతనేనిసురేష్, మల్లికార్జున్, సి పి యం నాయకులు బీరంశ్రీను, బి జె పి నాయకులు ముస్కుశ్రీనువాసురెడ్డి, సురకంటిలింగారెడ్డి, టి డి పి నాయకులు తుళ్ళూరి ప్రకాశ్, యం యల్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, టి జె యస్ నాయకులు పగడాల కరుణాకర్ రెడ్డి, సురకంటిప్రబాకర్ రెడ్డి, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.