భౌతిక దూరాన్ని పాటించండి కరోనా మహమ్మారిని తరిమికొట్టండి
దాతల సహకారం మరువలేనిది
తక్కళ్ళ పల్లి గూడెం లో ఆదివాసీ గొత్తీ కోయ గూడెం లో నిత్యావసర సరుకుల పంపిణీ
ఈ రోజు తాడ్వాయి మండలం బయ్యక్క పేట గ్రామములోని తక్కళ్ల పల్లి ఆదివాసీ గోత్తీ కోయ గూడెంలో బ్లూ ఫౌండేషన్ ప్రతినిధులు క్రాంతి కిరణ్, కిషోర్, మధు, అశోక్ ల సహకారంతో 34 కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, గోధుమ పిండి మాస్కులు ఇతర నిత్యావసర సరుకులు, పిల్లలకు ఆట బొమ్మలు పంపిణీ చేసారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉంటానని కరోనా రెండవ దశ తీవ్రతరంగా ఉందని ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
అవసరం ఉంటే తప్ప ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రాకుండా భౌతిక దూరాన్ని పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సీతక్క పిలుపునిచ్చారు.
మారు మూల అటవీ ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలకు అండగా నిలిచిన బ్లూ ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, మాజీ ఎంపీపీ ఇనగంటి రామయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సంజీవ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మామిడి శెట్టి కోటి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు సాయి కృష్ణ, జిల్లా నాయకులు గండ్రత్ విజయకర్
ఎస్సీ సెల్ మండల కార్యదర్శి వెంకటయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు ముక్క శ్రీనివాస్, మండల బీసీ సెల్ కార్యదర్శి కలువల సమ్మయ్య, సహకార సంఘం డైరెక్టర్ పురి కళ్యాణ్, మాజీ సర్పంచ్ ఊకె సారయ్య, బీసీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు నల్ల ముక్క సమ్మయ్య గౌడ్
ఎస్సీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులు జిడ్డి రాజు, వార్డు సభ్యులు ముక్క దుర్గయ్య, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎనగంటి రాము, మాజీ ఉప సర్పంచ్ బుషన రవి, మేడం రమణ కర్, తదితరులు పాల్గొన్నారు.