మాదిగలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం, లిడ్ క్యాప్ వ్యవస్థను పటిష్ట పరచడం సహా, తూర్పు గోదావరి, చిత్తూర్ జిల్లాలో ఇచ్చిన మాటను నెరవేర్చాలని సీ.ఎం జగన్ను ని కోరిన మాదిగ ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ మడికి కిషోర్ బాబు.
ఆంధ్రప్రదేశ్ మాదిగ సామాజిక వర్గం తరపున మాదిగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాదిగ ఐక్యవేదిక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ మడికి కిషోర్ బాబు మాట్లాడుతూ 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటి వరకు ఏ రాజకీయ పార్టీలు తమకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.
కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బాపట్ల ఎం.పి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు మాదికలకు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేసారు.
అలాగే పాదయాత్రలో మాట ఇచ్చిన విధంగా తూర్పు గోదావరి జిల్లా, చిత్తూరులో కూడా ఎం.పి, ఎం.ఎల్.సి, ఎం.ఎల్.ఏ సీట్లు తమకు కేటాయించాలని సీఎం జగన్ను ఈ సందర్భంగా కోరారు.
రానున్న రోజుల్లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల ప్రకారం వారికి ఇచ్చే సీట్లు, మరియు కో ఆప్షన్ మెంబెర్స్ అన్ని కార్పొరేషన్ లో కేటాయింపులు జరగాలని కోరారు.
సామాజికంగా రాజకీయంగా ఇప్పటికీ వెనుకబడే ఉన్నామని తమకు భరోసా కల్పించాలని సీ.ఎంని ప్రాధేయ పడుతున్నామని అన్నారు.
అలాగే నామినేటెడ్ పదవుల విషయం కావచ్చు, తమ ప్రధాన వృత్తి అయిన చర్మకార సంబంధిత లిడ్ క్యాప్ వ్యవస్థ పటిష్ట పరిచడం కావచ్చు, తమకు ఆర్ధికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందెలాగా కృషి చేయాలని కోరారు.
తమకు ఎం.పి, ఎం.ఎల్.సి, ఎం.ఎల్.ఏ పదవులు కూడా కేటాయించారని, ఇకముందు కూడా ఆ ప్రక్రియ కొనగించాలని, మాదిగలకు వై.ఏస్.ఆర్.సి.పి పార్టీ అంటే మా సామజిక వర్గానికి మంచి గుర్తింపు ఇచ్చే పార్టీ అని ప్రాధాన్యత సంతరించుకుంది అని తెలియజేసారు.
మా మాదిగ పల్లెల్లో స్మశాన వాటికలకు స్థలాలు కేటాయింపులు జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఆయన ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు సమావేశంలో మాట్లాడారు.
ఈ సమావేశంలో చాట్ల రాజేష్, ప్రత్తిపాటి శ్యామ్, లంక నాగన్న రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.