దవాయి భీ…కడాయిభీ..అనే నినాదం ఇచ్చిన నరేంద్ర మోడీ…
కొవిడ్ రెండో వేవ్ తుపానులా విరుచుకుపడుతోందని.. ఈసారి అది మరింత తీవ్రమైన సవాలు విసురుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
కొన్నాళ్లుగా కఠినమైన పోరాటం చేస్తున్నామని చెప్పారు. కరోనా సంక్షోభం నుంచి మనం తప్పక బయటపడాలన్నారు. దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడారు…
దేశంలో అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయమిది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని ఆయన అన్నారు.
దేశం నలుమూలలా ఆక్సిజన్ కొరత ఉందని, ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలియజేసారు.
సరిపడా ఆక్సిజన్ ఉత్పత్తి కోసం అనేక ప్లాంట్లు నెలకొల్పినట్లు. వైద్య అవసరాల కోసం ఉత్పత్తి పెంచినట్లు తెలిపారు.
ఫార్మా సంస్థలు త్వరితగతిన ఔషధాల ఉత్పత్తిని పెంచాయని, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఔషధ సంస్థలు భారత్లో ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
కరోనా రెండో దశలో ఔషధాల కొరత లేదని, దేశాన్ని లాక్డౌన్ నుంచి కాపాడాలని, లాక్డౌన్ను చివరి అస్త్రంగానే పరిగణించాలని అయన చెప్పారు.