ప్రభుత్వ సంస్థల్ని టీఆర్ఎస్ బలోపేతం చేస్తుంటే తెగనమ్ముతున్న తీరు బీజేపీది
ఈసారి నియోజకవర్గ పరిదిలో పార్టీ లక్షన్నర ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ల ఓట్లతో గెలుపు మన అభ్యర్థి సురభి వాణీదేవి గారిదే
ఐదేళ్ళకోసారి పీఆర్సీ 43% మనమిస్తే పదేళ్ళకోసారి ఇచ్చేది కేంద్రం
పార్టీ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ప్రచార ఇంచార్జులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం
తెలంగాణ ఆత్మగల పార్టీ టీఆర్ఎస్ మాత్రమే
ఒక్కొక్క కార్యకర్త యాభైమంది గ్రాడ్యుయేట్ ఓటర్లను కలవాలి
ఈవారం రోజులు టీఆర్ఎస్ సైనికులు బీజేపీ ద్రోహాల్ని ఎండగట్టాలి
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్
ఈసారి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఓటర్లుగా లక్షన్నరకు పైగా ఎన్రోల్మెంట్లను టీఆర్ఎస్ శ్రేణులు చేయించారు, వారిని పోలింగ్ బూత్ వరకూ తీసుకెల్లే భాద్యత ఆయా ఇంచార్జులదేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్ఘాటించారు.
మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జులు ఈరోజు కేటీఆర్ని బంజారాహిల్స్ లో కలిసారు.
ఈ సందర్భంగా వారికి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసారు. ఉద్యోగులు అడిగిన దానికన్నా ఎక్కువగా 43శాతం పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణదని, కేవలం పదేళ్లకోసారి పీఆర్సీ ఇచ్చే కేంద్రం కన్నా ఉద్యోగులకు రాష్ట్రమే ఎక్కువ మేలు చేసిందని గుర్తుచేశారు.
ఇప్పటికే అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్న కేంద్రం రాబోయే రోజుల్లో మన సింగరేణిని సైతం ప్రైవేటు పరం చేసే దుస్సాహసానికి ఒడిగడ్తుందని దుయ్యబట్టారు.
ఐటీఐర్, బయ్యారం ఉక్కు నుండి నేటి వ్యాగన్ ప్యాక్టరీని సైతం తెలంగాణ నుంచి లాక్కుపోయింది ఎవరో గుర్తుంచుకోవాలని గ్రాడ్యుయేట్లని కోరారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నియమితులైన లక్షా ముప్పైమూడు వేల కుటుంబాలతో పాటు మెజార్టీ ఉద్యోగుల మద్దతు మనకే ఉందన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు.
దక్షిణ భారతదేశంపై చిన్నచూపు చూసే బీజేపీ మన రాష్ట్రంతో పాటు యావత్ దక్షణాది రాష్ట్రాలకు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టుల రద్దుకు బీజేపీ అభ్యర్థులు సమాదానం చెప్పాలన్నారు కేటీఆర్.
దేశవ్యాప్తంగా 16ఐఐటీ, 10ఎన్ఐటి, 85నవోదయాలు మంజూరైనా… తెలంగాణకు రిక్తహస్తం చూపిన కేంద్రంకు సరైన తీర్పుని ఇవ్వాలని విజ్ణప్తి చేసారు.
55వేల కోట్లనుండి లక్షా నలబై ఐదువేల కోట్లకు ఐటీ ఎగుమతులు పెంచామని తద్వారా లక్షాలాది తెలంగాణ యువకులకు ఉపాది దొరికిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇంతటి అభివ్రుద్ది సాదిస్తున్న కేసీఆర్ నాయకత్వానికి మద్దతుగా మెదటి ప్రాదాన్యతా ఓటును సురభి వాణిదేవి గారికి వేసి గెలిపించాలని కోరారు.
అంతకుముందు బంజారాహిల్స్ లో డివిజన్ ఇంచార్జులతో మంత్రి గంగుల కమలాకర్ బేటీ అయ్యారు.
తెలంగాణకు ఎనలేని ద్రోహాలు చేస్తూ ఏ మొఖం పెట్టుకొని బీజేపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడగడానికి వస్తున్నారని ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఇంచార్జి, మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.
బీజేపీ ద్వంద విధానాల్ని ఎండగట్టాలని, గల్లీలో ఒకటి చెప్తూ ఢిల్లీలో తెలంగాణపై కక్ష్య తీర్చుకొనే వారి దుర్మార్గ వైఖరిని ప్రజలకు వివరించాలని ఈరోజు హైదరాబాద్లో జరిగిన ఉమ్మడి హైదరాబాద్ జిల్లా డివిజన్ ఇంచార్జులు, ముఖ్యనేతల సమావేశంలో మంత్రి గంగుల పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసారు.
తెలంగాణ ఆత్మగల పార్టీ కేవలం టీఆర్ఎస్ మాత్రమేనని, పార్టీని కాపాడుకోవడం అంటే తెలంగాణను కాపాడుకోవడమేనని సూచించారు.
పార్టీ బాగుంటేనే మనం బాగుంటామని అలాంటి పార్టీ కోసం ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని వారిని ఉత్సాహ పర్చారు.
ప్రతీ కార్యకర్త యాభైమంది గ్రాడ్యుయేట్ ఓటర్లను ఖచ్చితంగా కలవాలని, వారి సమస్యలకోసం మన అభ్యర్థి సురభి వాణీదేవి తన గళం విన్పిస్తారని చెప్పాలన్నారు.
కేవలం ఆరేళ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గణనీయమైన అభివృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఏ ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలలో లేని సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దేశానికే మార్గదర్శనం చేస్తున్న తెలంగాణలో బీజేపీ నాటకాలు సాగవన్నారు గంగుల.
ఎన్నోరంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణకు ఊతమివ్వాల్సింది పోయి ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు మెదలు నిన్నటి ఖాజీపేట వ్యాగన్ ప్యాక్టరీ రద్దువరకూ బీజేపీ చేస్తున్న ద్రోహాల్ని ఎండగట్టాలన్నారు.
లక్షాముప్పైవేల పైచీలుకు ఉద్యోగాలిచ్చిన ఘనత టీఆర్ఎస్దే అని చెప్పుకొచ్చారు, వేలకోట్లను కేటాయించి అందిస్తున్న పీజు రియంబర్స్మెంట్, సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, సన్నబియ్యం బోజనం వంటి విద్యార్థి అనుకూల ప్రభుత్వం మనదే అని తెలియజేశారు.
ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, బ్రహ్మాండమైన మెజారిటీతో సురభి వాణీదేవి గెలుపు కోసం ప్రతీ కార్యకర్త శ్రమించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఇంచార్జులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రసమయి, సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.