ఉద్యోగం ఎరగా… తీర్చుకున్నారు సరదా… మంత్రిగారి రాసలీలు బహిర్గతం
మహిళతో మంత్రిగారి రాసలీలలు.. సీడీ బయటపెట్టిన సామాజిక కార్యకర్త
ఉద్యోగాన్ని ఎరగా చూపించాడు, అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు, కావలసిన కోరిక తీర్చుకున్నాడు, అంతా అయిపోయాక కాదు పోమ్మన్నాడు. ఇదీ అతడిపై వచ్చిన ఆరోపణ.
కర్ణాటక అధికార పార్టీలో మంత్రి ఆయన, ఒక సామాజిక కార్యకర్త విడుదల చేసిన వీడియో ఏకంగా తన పదవికే ఎసరు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వళితే, తన వద్దకు ఉద్యోగం ఇప్పించమంటూ వచ్చిన ఓ మహిళను తాను కోరిన ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లోబరచుకున్నారు ఆ మంత్రిగారు, తీరా చూస్తే వాంఛ తీర్చుకున్నారే తప్ప ఉద్యోగం ఉసే ఎత్తడంలేదు. మోసపోయినట్లు గ్రహించిన మహిళ సామాజిక కార్యకర్త నాగరిక హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేష్ కలహళ్లి ని సంప్రదించింది. మంత్రి తనతో గడిపిన ఏకాంత వేళలో తీసిన వీడియోలను అతడి చేతిలో పెట్టింది. సదరు సామాజిక కార్యకర్త ఆ వీడియోలను బహిర్గతం చేశారు.
అయితే ఈ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, కేవలం తనను అప్రదిష్టపాలు చేసేందుకే తనను ఈ విధంగా ఇరికిస్తున్నారని, అసలు ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, తనను ఇబ్బందులకు గురిచేసేందుకే ఎవరో కావాలని ఈ విధంగా చేశారని, అసలు ఆ మహిళ ఎవరో కూడా తనకు తెలియదని సదరు మంత్రి వాపోతున్నారు.
నిజానిజాలు ఎలా ఉన్నప్పటికి, ఆ వీడియో చూసిన వాళ్ళఉ మాత్రం ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు అనే విషయాన్ని పక్కన పెడితే అందులే ఉన్న వ్యక్తుల మధ్య జరిగిన తతంగం మాత్రం ఇద్దరి పరస్పర అంగీకారంతోనే జరిగినట్టుగా భావిస్తున్నారు. ఒక వేళ ఆ వీడియోలో ఉన్నది నిజంగా సదరు మంత్రిగారే అయినట్లైతే ఇది ఒక హనీట్రాప్ లాగా కనిపిస్తుంది.
ఇందులోని నిజానిజాలు ఎలా ఉన్నప్పటికి ఈ స్కాండల్ బయటపడటంతో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు మాత్రం తన మంత్రిపై ఇలాంటి ఆరోపణలు ఎదురవడం పెద్ద తలనొప్పిగానే మారింది.