అద్బుతాన్ని పూర్తి చేసిన భారత రైల్వే
జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు.
ఈ వంతెన పనుల్లో వంపు నిర్మాణం చివరి దశ పనులు మిగిలి ఉండగా ఆ పనులను కూడా పూర్తి చేశారు.
దీనితో ప్రపంచ రైల్వే చరిత్రలో భారత్ తన సమర్థతను మరొక్కసారి చాటుకుంది.
జమ్మూకాశ్మీరంను మిగతా భారతదేశంతో అనుసంధానించే లక్ష్యంతో ఈ రైల్వే వంతెనను నిర్మించారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ చివరి ఘట్టపు పనులను పర్యవేక్షించారు.