చిలకలూరిపేటలో అక్రమంగా తరలిస్తున్న మద్యం
9మందిని అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ సీఐ కర్ణ
732 మద్యం సీసాలు స్వాధీనం
చిలకలూరిపేట: స్థానిక పట్టణంలోని పురోషోత్తపట్టణంకు చెందిన వ్యక్తి తెలంగాణ నుండి అక్రమ మద్యం తీసుకొస్తున్న దేవి రెడ్డి గ్యాంగ్ ను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ కర్ణ మెరుపు దాడులు నిర్వహించి మద్దిరాల సమీపంలో పట్టుకున్నారు.
తెలంగాణ నుండి మద్యం తెచ్చి బెల్టు షాపులకు విక్రాయిస్తున్న దేవి రెడ్డి గోపితో పాటు మరో 8 మందిని అరెస్టు చేసారు.
వారి వద్ద నుండి 732 మద్యం సీసాలు 5 మోటర్ సైకిళ్ళు ఒక ఎనోవా వాహనం ఒక ఆటో స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ కర్ణ మీడియాకు తెలియజేశారు.
మద్యం విలువ సుమారు 11 లక్షలు ఉంటుందని సీఐ కర్ణ తెలిపారు. ఈ గ్యాంగ్ కు చెందిన గోపి గతంలో తెలంగాణ నుండి అక్రమ మద్యం తీసుకోస్తూ పలు చోట్ల పట్టుపడినట్లు ఇతనిపై వున్న కేసులు వెరిఫై చేస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ కర్ణ తెలియజేశారు.
