300 కిలోల హెరాయిన్, ఐదు ఎకె -47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్న ఐసిజి
శ్రీలంకకు చెందిన బోట్ల నుంచి 3000 కోట్ల రూపాయల విలువైన 300 కిలోల హెరాయిన్‌ను ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి) స్వాధీనం చేసుకుంది.
మినికోయ్ ద్వీపానికి సమీపంలో ఉన్న ఈ శ్రీలంక పడవల నుండి 1000 లైవ్ రౌండ్లతో ఐదు ఎకె -47 రైఫిల్స్‌ను కూడా స్వాధీనం చేసుకుంది.
అరేబియా సముద్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే అవకాశం ఉన్న విదేశీ పడవ గురించి మార్చి 15 న ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందినట్లుగా రక్షణ శాఖ పత్రికా ప్రకటనలో తెలిపింది.
సమాచారం అందుకున్న తరువాత, అనుమానాస్పద పడవలను గుర్తించడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ వాయు-సముద్ర సమన్వయంతో ఆపరేషన్ ప్రారంభించింది.
బోట్లపై చేపట్టిన ఈ ముమ్మర తనిఖీల్లో, 300 కిలోల హై గ్రేడ్ హెరాయిన్ మరియు 1000 లైవ్ రౌండ్లతో ఐదు ఎకె -47 రైఫిల్స్ శ్రీలంక ఫిషింగ్ బోట్ రవిహన్సి నుండి స్వాధీనం చేసుకున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో మాదకద్రవ్యాల అంచనా విలువ సుమారు రూ.3000 కోట్లు దాకా ఉండవచ్చు.
భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో పక్షం రోజుల్లో ఐసిజి ఛేదించిన రెండవ అతిపెద్ద మాదక ద్రవ్యాల రవాణా ఆపరేషన్ ఇది.
మార్చి 5 న, ఐసిజి నౌకలు మరియు విమానాల సంయుక్త ఆపరేషన్ ద్వారా, లక్షద్వీప్ సముద్రాలలో, మినికోయ్ ద్వీప ప్రాంతంలో 6 మంది సిబ్బందితో శ్రీలంక పడవ ఆకర్ష దువాను విజయవంతంగా పట్టుకుంది.
గత సంవత్సరం సుమారు 4900 కోట్ల రూపాయల విలువైన 1.6 టన్నుల మాదకద్రవ్యాలను ఐసిజి విజయవంతంగా స్వాధీనం చేసుకున్నది.
సముద్ర మార్గంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులకు ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ.
ఐసిజి ప్రారంభించినప్పటి నుండి చేపట్టిన ఆపరేషన్ల ద్వారా ఇప్పటివరకు మొత్తం రూ. 10,952 Cr విలువగల మాదక ద్రవ్యాలను స్వధీనపరచున్నది.
ఈ నిరంతర విజయవంతమైన మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యకలాపాలు వివిధ ప్రభుత్వ సంస్థలు మరియు ఐసిజిలతో సమాచార సమన్వయానికి నిదర్శనంగా నిలుస్తుంది.
ఈ సమన్వయం మరియు ఐసిజి అచంచలమైన నిబద్ధత విధ్వంశకర ఉద్దేశంతో మన సముద్ర మండలాలను దోపిడీ చేసే దేశ వ్యతిరేక శక్తుల ఆగడాలకు అడ్డుకట్టగా నిలిచింది.