మానవ సేవే జమాతె ఇస్లామీ హింద్ ముఖ్య ఉద్దేశం..
జమాతె ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షులు రఫిఖ్..
మండపేట: ఆపదలో ప్రజలను ఆదుకోవాలనే ఒక మంచి ఆశయంతో కోవిడ్ రిలీఫ్ వింగ్ సభ్యులు సేవచేస్తున్నారని జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ పేర్కొన్నారు.
కోవిడ్ రిలీఫ్ వింగ్ సభ్యులతో జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు రఫిఖ్ ఆత్మీయ సమావేశం మంగళవారం స్దానిక జమాత్ కార్యలయంలో జరిగింది.
ఈ సమావేశానికి జమాత్ స్దానిక అధ్యక్షులు ఇమ్రాన్ షరీఫ్ అధ్యక్షత వహించారు. సమావేశంలో సభ్యులు తమ తమ అనుభవాలను రాష్ట్ర అధ్యక్షుడుతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రఫీఖ్ మాట్లాడుతూ జమాత్ రాష్ట్ర వ్యాప్తంగా 40 అంబులెన్స్ లు ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని, 10000 అక్సిజన్ సిలిండర్స్ తో ప్రజలకు ప్రాణవాయువు అందించడం జరిగిందని తెలియజేశారు.
ప్రతీరోజు 4000 మందికి పౌష్టికాహారం అందించడం జరుగుతుందని అన్నారు. మండపేటలో సేవా కార్యక్రమాలు వేగవంతంగా చేయడం జరుగుతుందని అన్నారు.
రేపు ఒక 100 మందికి రేషన్ కిట్స్ అందించే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి SM షరీఫ్ జమాత్ సభ్యులు షాహిద్, అబులాలా, జైనులాబీదీన్, రహ్మన్, నజీర్, కమాల్, అమిర్ జమాత్ కార్యకర్తలు, SIO యువకులు పాల్గొన్నారు.