కరోనా మానవ సంబంధాలను తెంచేస్తుంది
కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు చేయటానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడం లేదు. దీంతో అనాధ శవాలను యువతే ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సంకిలిలో కూడా ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది.
సంకిలికి చెందిన సూరు వెంకటరత్నం నిన్న ఇంటి మెట్లు దిగుతున్న సమయంలో కాలుజారి పడిపోయింది. తల వెనుక భాగంలో దెబ్బ తగలడంతో ఆమే చనిపోయింది.
కింద పడి మృతి చెందిన మహిళ అంత్యక్రియలు జరిపించేందుకు ఎవరూ ముందుకి రాలేదు.
మృతదేహాన్ని తరలించటానికి కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. చివరకు సచివాలయ సిబ్బంది రిక్షా పై తీసుకువెళ్లి అంత్యక్రియలు చేశారు.
