హైదరాబాదులో భారీగా బయటపడుతున్న బ్లాక్మనీ
రెండు వారాల్లోనే రూ.3,200 కోట్లు గుర్తించిన ఐటీ
ఓ ఫార్మా కంపెనీతోపాటు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో బ్లాక్మనీ
హైదరాబాద్లో భారీగా బ్లాక్మనీ బయటపడుతుంది. రెండు వారాల్లోనే రూ.3,200 కోట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఓ ఫార్మా కంపెనీతో పాటు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో బ్లాక్మనీ గుర్తించారు.
10 రోజుల క్రితం ఫార్మా కంపెనీలో నిర్వహించిన సోదాల్లో రూ.రెండు వేల కోట్ల బ్లాక్మనీ లావాదేవీలు గుర్తించారు. తాజాగా రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో బ్లాక్మనీ లావాదేవీలు వెలుగుచూశాయి.
హైదరాబాద్కు చెందిన స్పెట్రా, సన్సిటీ కంపెనీల్లో నిర్వహించిన ఐటీ సోదాల్లో రూ.700 కోట్ల బ్లాక్మనీ లావాదేవీలు ఐటీ గుర్తించింది.
బ్లాక్మనీ లావాదేవీల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను కంపెనీలు తయారుచేసుకున్నాయి. యాదాద్రి తదితర ప్రాంతాల్లో భారీగా కంపెనీలు వెంచర్లు వేశాయి.
వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రెండు కంపెనీల లావాదేవీలను ఐటీ అధికారులు సీజ్ చేశారు.