అమరావతి: కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటలో భారీగా నగదు స్వాధీనం..
పరిషత్ ఎన్నికల వేళ ఆంధ్ర- తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు వద్ద భారీగా నగదును కృష్ణా జిల్లా పోలీసులు స్వాధీన పరచుకున్నారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఆంధ్రా-తెలంగాణా సరిహద్దు ప్రాంతంలో ఒక కారులో ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న సుమారు కోటి నలభై లక్షలు స్థానిక పోలీసులు స్వాధీన పరచుకున్నారు.
ఈ ఘటనలో నగదును తరలించేందుకు ఉపయోగించిన కారుతో పాటు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిపై సెక్షన్ 102 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అంతేగాక సంబంధిత అధికారులకు సమాచారం తెలియ పరిచినట్లు ఎస్ఐ వాసా వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు.