కరోనా వ్యాక్సిన్ కొరకు పేర్లు నమోదు చేసుకోవడం ఎలా?
కరోనా వ్యాక్సిన్ కొరకు18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు 28వ తేదీ నుండి ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవచ్చు..
దేశంలో 18 ఏళ్లు పైబడిన వారు కోవిడ్ 19 టీకా తీసుకునేందుకు ఈనెల 28 నుంచి పేర్లు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆన్ లైన్ పోర్టల్ కోవిన్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ మూడో దశలో భాగంగా మే 1 నుండి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇందుకు అవసరమైన మార్పులు కోవిన్ లో చేసినట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
కోవిన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ ఈ విధంగా చేయాలి..
కోవిన్ పోర్టల్ లోకి వెళ్లి రిజిస్టర్/ సైన్ ఇన్ యువర్ సెల్ఫ్ ను క్లిక్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ నమోదు చేస్తే ఓటిపి వస్తుంది. దీన్ని నమోదు చేసి, వెరిఫై బటన్ను క్లిక్ చేయాలి.
తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో అడిగిన వివరాలు (ఫోటో గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ) నమోదు చేసి రిజిస్టర్ బటన్ పై క్లిక్ చేయాలి.
ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకోవచ్చు. దానికోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్ ను క్లిక్ చేయాలి.
పిన్ కోడ్ నమోదు చేసి వెతికితే దాని పరిధిలోని టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని ధృవీకరించాలి.
ఒక్క లాగిన్ పై నలుగురికి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది.