కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా హనుమజ్జయంతి, ప్రత్యేక అభిషేకాలు..
మండపేట: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మండపేట కరాచీ సెంటర్లో వేంచేసియున్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో శుక్రవారం హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఆలయ ధర్మకర్త మన్యం మహేష్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ఖండవల్లి శ్రీనివాస భార్గవ ప్రత్యేక పూజలు జరిపించారు.
స్వామివారికి పంచామృత అభిషేకం, పలు రకాల పళ్ళ రసాలతో అభిషేకం. సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించారు.
స్వామివారికి తమలపాకులు, గంధ సింధూర నామార్చన ఘనంగా జరిగింది. స్వామివారికి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు.
హనుమజ్జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే జోగేశ్వరరావు పూజలు..

హనుమాన్ జయంతి సందర్బంగా మండపేట పట్టణంలో రధం సెంటర్ నందు వేంచేసియున్న శ్రీ ఆంజనేయస్వామిని శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు శుక్రవారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పెనుమర్తి సబ్బారావు, మేడింటి సూర్యప్రకాష్, దామిన వీర్రాఘవులు (అబ్బు), తదితరులు ఉన్నారు.