ఆక్సిజన్ అందించాలి:ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ తీవ్రత అధికంగా ఉందని, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన ఆక్సిజన్‌ను వైజాగ్ స్టీల్‌ప్లాంట్ నుంచి జిల్లాకు సరఫరా చేయాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు.
ఈమేరకు కేంద్ర ఉక్కు గనులశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, విశాఖ స్టీల్‌ప్లాంట్ సిఎండికి మంగళవారం లేఖ రాశారు.
వైద్య రంగానికి ఆక్సిజన్‌ను తయారు చేసి, కోవిడ్ సమయంలో దేశానికి సేవలందిస్తున్న స్టీల్‌ప్లాంట్ యాజమాన్యాన్ని, కార్మికుల సేవలను ఆయన కొనియాడారు.
రెండు వారాలుగా రాష్ట్రంలో అత్యధిక కోవిడ్ కేసులు జిల్లాలో నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కావాల్సిన వైద్య సామగ్రిని అందించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నా, ఆక్సిజన్ సరిపడినంత అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతిరోజూ సుమారు పది కిలో లీటర్ల అదనపు ఆక్సిజన్ అవసరమవుతున్నట్లు వైద్య నిపుణులు చెప్తున్నారని, జిల్లా అవసరాలను తీర్చడానికి వైజాగ్ స్టీల్‌ప్లాంట్ నుంచి ఆక్సిజన్ అందించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
కోవిడ్ బారి నుంచి జిల్లా ప్రజలను ఆదుకోవాలని కోరారు.
కోవిడ్ బాధితులకు హెల్ప్‌లైన్
జిల్లాలోని కోవిడ్ బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు వీలుగా 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా హెల్ప్‌లైన్ సేవలను ప్రారంభించినట్లు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
కోవిడ్ హెల్ప్ శ్రీకాకుళం పేరుతో ట్వీట్ చేయాలని, 7207387931 హెల్ప్‌లైన్ నంబరుకు వాట్సాప్ మెసేజ్ పంపించాలని సూచించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.