కోవిద్ బాధిత విద్యార్ధులు తమ ఫీజులు వాప స్ తీసుకోండి. గీతాంజలి స్కూల్ యాజమాన్యం
శ్రీకాకుళం: తమ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థులు కరోనా మహమ్మారి ప్రబావంతో దురదృష్ట వసాత్తు తమ తల్లిదండ్రలను కోల్పోయిన వారు విద్యా సంస్థకు చెల్లించిన ఫీజులు వాపస్ తీసుకోవాలని గీతాంజలి స్కూల్ యాజమాన్యం కోరింది.
2020-2021 విద్యా సంవత్సరనాకి సంబంధించి సదరు బాధిత గీతాంజలి విద్యా సంస్థ విద్యార్థులు ఏ విధమైన ఫీజులు చెల్లించినా వాపసు తీసుకోవాలని గీతాంజలి స్కూల్ కరెస్పాండెoట్ సనపల ఉమాదేవి ఒక ప్రకటనలో కోరారు.
విద్యా సంస్థ అంటేనే ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తున్న ఈ రోజుల్లో మానవత్వం చాటుకొని విద్యార్థుల ప్రయోజనాలు కోసం గీతాంజలి స్కూల్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం నేటి విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభినందిస్తున్నారు.
