గీసుకొండ: వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం గ్రామం కోవిడ్ నియంత్ర ణలో ఆదర్శంగా నిలుస్తోంది.
ప్రభుత్వ సూచనల మేరకు అన్ని నిబంధనలు అమలు చేస్తుండటంతో ప్రస్తుతం గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు.
ఇక మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించగా సర్పంచ్ అల్లం బాలిరెడ్డి చొరవ తీసుకుని 150 మందిని గీసుకొండ పీహెచ్సీకి ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లి టీకా వేయించారు.
ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తుండటంతో గురువారం నాటికి 164 మందికి టీకా వేయించారు.
ఈ ఊరి మొత్తం జనా భా 750 కాగా, గ్రామంలో 45 ఏళ్లు పైబడిన మొత్తం 314 మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లయింది.