వరంగల్ : ఈరోజు హన్మకొండలోని బీజేపీ వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కార్యాలయంలో మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి రామ్మోహన్ రావు గారు పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ , రూరల్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డీ, మాజీ ఎమ్మెల్యే వన్నల శ్రీరాములు, కార్పొరేటర్ కొరాబోయిన సాంబయ్య, రాష్ట్ర నాయకులు పుల్లురి అశోక్, కుసుమ సతీష్, బన్న ప్రభాకర్, త్రిలోక్, ముత్యల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ:
పట్టా భద్రులు అందరి బీజేపీ పార్టీ అభ్యర్థి మద్దతు ఇవ్వాలని కోరారు.
దుబ్బాక, హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తీరులోనే పట్టా భద్రుల ఎన్నికల్లో సైతం విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టా భద్రుల ఎన్నికల్లో బీజేపీ పట్టం కట్టాలని పిలిపునిచ్చారు.
లక్ష ఇరవై ఐదు వేల మంది ప్రవేట్ ఉద్యోగులు కూలి పని చేసుకొంటున్నారని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉద్యోగుల కల్పన విషయంలో అబద్ధాపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
టీఆరెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరని నిలబెట్టినారో ప్రజలకు తెలుసునని, ప్రజలే సరైన నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు.
వరంగల్ కు వరదలు వస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు కాని హైదరాబాద్ ప్రజలకు 10 వేలు ఇచ్చారు వరంగల్ ప్రజల పై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.
వరంగల్ మెడికల్ కాలేజీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
1984 లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్ తీసుకు వెళ్లారు.. కోచ్ ఫ్యాక్టరీ కావాలని ఎంపీ లు ఒక్క రోజు పార్లమెంట్ లో మాట్లాడ లేదని ఆయన అన్నారు.
టీఆరెస్ పార్టీ ఎన్నికల కోసం రాజకీయ లబ్ది కోసం మాట్లాడుతూ న్నారని వాపోయారు.
గిరిజన యూనివర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేయలేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు.