దొంగ నోట్ల ధందా @ హైదరాబాద్ వయా పిడుగురాళ్ళ
అయ్యా 40 లక్షల రూపాయల విలువైన రంగురాళ్ళు పోయాయి నాకు న్యాయం చేయండి అంటూ యల్ బి నగర్ పోలీసులను ఆశ్రయించాడు హైదరాబాద్ నాగోలులోని ఓ జోతిష్యుడు మురళి కృష్ణ శర్మ.
పోలీసులు కేసు నమోదు చేసుకుని సదరు జోతిష్యునికి తగిన న్యాయం చేద్దామని విచారణ ప్రారంభించారు. కేసుకు సంబంధించిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నిందితులు తెలిపిన వివరాలు విని అవాక్కయ్యారు.
తీగలాగితే డొంకంతా కదిలినట్లు, ఫిర్యాదు చేసిన జోతిష్యుని అసలు భాగోతం అంతా తమ నిందితులు తెలిపిన సమాచారంతో బయటపడింది.
అసలు విషయం ఏంటంటే, ఫిర్యాదు చేసిన జోతిష్యుడు మురళీ కృష్ళ శర్మ అసలు వ్యాపారం దొంగనోట్ల చలామణి, తమకు నిందితుల నుండి అందిన సమాచారం మేరకు సదరు జోతిష్యుని ఇంట్లో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున దొంగనోట్లు బయట పడ్డాయి.
ఈ సోదాల్లో పోలీసులు సదరు జోతిష్యుని నుండి 6 లక్షల రూపాయల నగదు, కారు, 10 సెల్ఫోనులతో పాటు దాదపు 18 కోట్ల రూపాయల విలువ గల నకిలీ 2వేల రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
అంతేగాక, సదరు జోతిష్యుడు గతంలో కూడా హవాలా కేసులో జైలుకు వెళ్ళివచ్చినట్లు కూడా పోలీసులు విచారణలో బయటపడింది.
ఈ ఉదంతంలో ఈ మూఠాకు చెందిన మరో ఆరుగురు సభ్యులను అంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు.
వారి వివరాలు, వేల్పురి పవన్ కుమార్ చారి, దొండపాటి.రామకృష్ణ,నలబోతుల సురేష్ గోపి,చందులూరి విజయ్ కుమార్, కంభంపాటి సూర్య, చందులూరి నాగేంద్ర ప్రసాద్ శర్మ.