ఇటీవల సామాజిక మాధ్యమాల్లో నగర పరిధిలో హెల్మెట్ లేకుండా ప్రయాణించ వచ్చును అంటూ ఒక ప్రచారం వైరల్‌గా కొనసాగుతుంది.
సదరు ప్రచారం ప్రకారం సాగర్ కుమార్ జైన్ అనే ఒక వ్యక్తి వేసిన పిటిషన్ పరిశీలించిన కోర్టు, ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీని తిరస్కరించిందని పేర్కొంది.
మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్‌కు హెల్మెట్ వాడకం తప్పనిసరి కాదు. మీ రక్షణ మీ ఇష్టం. అంటూ కోర్టు పేర్కొన్నట్లు ఆ సందేశం యొక్క సారాంశం.
రాష్ట్ర రహదారి లేదా జిల్లా రహదారి హోదా పొందిన రహదారిపై హెల్మెట్ ధరించడం అయితే తప్పనిసరి అని, ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు ‘ మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని మిమ్మల్ని, అడిగితే.. నేను
మునిసిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని మీరు వారికి చెప్పవచ్చును అంటు సందేశమిస్తున్నారు.
అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉన్నదనే విషయంపై పరిశోధించిన ఆంధ్రా జంక్షన్ టీంకి ఇది కేవల కల్పితమని, ఒక తప్పుడు ప్రచారమని తేలింది.
ఈ వైరల్ మెసేజ్ గురించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారి స్పందన వారి ఫేస్బుక్ పేజ్‌లో స్పష్టంగా ఉంది, ఈ ప్రచారాన్ని ఫేక్ ప్రచారంగా వారు స్పష్టం చేశారు.