అస్సాంలో భూకంపం..! ప్రధాని పరామర్శ!!
గువహటి: అస్సాంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.7గా నమోదైనట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం (ఎన్ఎసీసీ) ధ్రువీకరించింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సైతం భూకంపం సంభవించినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
‘అస్సాంలో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. పూర్తి వివరాల కోసం వేచి చూడాల్సి ఉంది’ అంటూ సీఎం ట్వీట్లో పేర్కొన్నారు.
సోనిత్పూర్ జిల్లా, దేకియాజులీ కేంద్రంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ఆయన మరో ట్వీట్లో తెలిపారు. గువహటిలో భూకంపం ధాటికి పలు భవనాలు ధ్వంసమైన చిత్రాలను సైతం పోస్ట్ చేశారు.
ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు దేశ ప్రధాని మోదీ ట్వీట్ చేసారు.
అంతేగాక కేంద్రం నుండి అందిచవలసిన అన్ని విధాలా సహాయం అందిస్తామని హామి ఇస్తూ ప్రజలందరు బాగుండాలని కోరారు.