శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దంపతులు.
శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు వరంగల్ భద్రకాళీ దేవాలయంలో అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న గౌరవ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు.
తదనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తు వరంగల్ నగర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.
ఉగాది నూతన సంవత్సరం నుండి కరోనా వైరస్ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని భద్రకాళీ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించడం జరిగిందని తెలిపారు…