లాక్ డౌన్ లో నిత్యావసర సరుకులు పంపిణీ..
మండపేట: లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు మండపేటకు చెందిన మందపల్లి జయ ప్రతాప్, మోనికా సెలస్ దంపతులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవి కుమార్, 7వ వార్డు వైసీపీ ఇంచార్జ్ మందపల్లి రుద్రకాంత్ లు మాట్లాడుతూ ఈ దంపతులను ఆదర్శంగా తీసుకుని దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలకు సహాయ, సహకారాలు అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్య వేదిక రామచంద్రపురం డివిజన్ అధ్యక్షులు మందపల్లి సంజీవరావు, పెందుర్తి సూరిబాబు, మందపల్లి భాస్కరరావు, దాసరి తాతాజీ తదితరులు పాల్గొన్నారు.