నిక్లోసమైడ్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన సి.ఎస్.ఐ.ఆర్
కోవిడ్-19 చికిత్స కోసం తిరిగి ఉద్దేశించిన ఔషధం “నిక్లోసమైడ్” క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించిన – సి.ఎస్.ఐ.ఆర్ ఇండియా మరియు లక్సాయ్ లైఫ్ సైన్సెస్ సంస్థలు
లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో సి.ఎస్.ఐ.ఆర్., కోవిడ్ -19 చికిత్స కోసం యాంటీ-హెల్మినిటిక్ ఔషధం “నిక్లోసమైడ్” రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది.
ఆసుపత్రిలో చేరిన కోవిడ్ -19 రోగుల చికిత్స కోసం “నిక్లోసమైడ్” యొక్క సమర్థత, భద్రత మరియు సహనాన్ని అంచనా వేయడానికి, మల్టీ-సెంట్రిక్, ఫేజ్-2, రాండమైజ్డ్, ఓపెన్ లేబుల్ క్లినికల్ అధ్యయనంగా ఈ పరీక్షలు చేపట్టారు.
పెద్దవారిలో మరియు పిల్లల్లో టేప్-వార్మ్ సంక్రమణ చికిత్స కోసం నిక్లోసమైడ్ గతంలో విస్తృతంగా ఉపయోగించబడింది.
ఈ ఔషధం యొక్క భద్రతా ప్రొఫైల్ కాలక్రమేణా పరీక్షించబడింది. అలాగే, వివిధ మోతాదు స్థాయిలలో మానవ వినియోగానికి సురక్షితంగా కనుగొనబడింది.
“నిక్లోసమైడ్” ఉపయోగించి రెండవ దశ క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి ఎస్.ఈ.సి. సిఫారసులపై సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మాండే, సంతోషం వ్యక్తం చేశారు.
ఇది సాధారణ, సరసమైన ఔషధం మరియు భారతదేశంలో సులభంగా లభిస్తుంది. అందువల్ల మన జనాభాకు అందుబాటు లో ఉంచవచ్చునని, ఆయన తెలియజేశారు.
డి.జి-సి.ఎస్.ఐ.ఆర్. సలహాదారు డాక్టర్ రామ్ విశ్వకర్మ ఈ విధంగా తెలియజేశారు:
ఎ) “సిన్సిటియా” ఏర్పడటాన్ని నిరోధించే ఔషధాలను గుర్తించడానికి ఒక స్క్రీన్ లో, “నిక్లోసమైడ్” ను, ఆశాజనకంగా పునర్నిర్మించిన ఔషధంగా, ఈ ప్రాజెక్టులో సహకరించిన లండన్లోని కింగ్స్ కళాశాల కి చెందిన పరిశోధనా బృందం, గుర్తించబడింది.
కోవిడ్-19 సోకిన రోగుల ఊపిరితిత్తులలో గమనించిన “సిన్సిటియా” లేదా ఫ్యూజ్డ్ కణాలు బహుశా సార్స్-కోవ్-2 స్పైక్ ప్రోటీన్ యొక్క ఫ్యూసోజెనిక్ కార్యకలాపాల ఫలితంగా ఉండవచ్చు. “నిక్లోసమైడ్” ఔషధం “సిన్సిటియా” ఏర్పడటాన్ని నిరోధించవచ్చు.
బి) పి.హెచ్. డిపెండెంట్ ఎండోసైటిక్ పాత్ వే ద్వారా వైరస్ ప్రవేశించడాన్ని నిరోధించడంతో పాటు సార్స్-కోవ్-2 ప్రవేశాన్ని కూడా సమర్ధంగా నిరోధించగల ఔషధంగా “నిక్లోసమైడ్” కూడా నిరూపించబడినట్లు, జమ్మూ లోని సి.ఎస్.ఐ.ఆర్-ఐ.ఐ.ఐ.ఎం, మరియు బెంగుళూరు లోని ఎన్.సి.బి.ఎస్. ల మధ్య, స్వతంత్ర, సహకార పరిశోధన ఇటీవల వెల్లడించింది.
ఈ రెండు స్వతంత్ర ప్రయోగాత్మక అధ్యయనాల దృష్ట్యా, కోవిడ్-19 రోగులలో క్లినికల్ ట్రయల్ కోసం, “నిక్లోసమైడ్” ఇప్పుడు, ఒక మంచి ఔషధంగా అవతరించింది.
హైదరాబాద్ లోని సి.ఎస్.ఐ.ఆర్-ఐ.ఐ.సి.టి. డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్ర శేఖర్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఐ.ఐ.సి.టి. లో అభివృద్ధి చేసిన మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్-గ్రేడియంట్ (ఎ.పి.ఐ) ను లక్సాయ్ లైఫ్ సైన్సెస్ తయారు చేస్తోందనీ, ఈ ముఖ్యమైన క్లినికల్ ట్రయల్ లో ఈ సంస్థ ఒక భాగస్వామిగా ఉందనీ, ఈ ట్రయల్ విజయవంతమైతే రోగులకు తక్కువ ఖర్చుతో కూడిన చికిత్స అందుబాటులోకి వస్తుందనీ, ప్రత్యేకంగా పేర్కొన్నారు.
లక్సాయ్ సీ.ఈ.ఓ. డాక్టర్ రామ్ ఉపాధ్యాయ మాట్లాడుతూ, “నిక్లోసమైడ్” సామర్థ్యాన్ని గ్రహించి, క్లినికల్ ట్రయల్స్ చేపట్టడానికి గత సంవత్సరంలోనే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు, తెలియజేశారు.
డ్రగ్ రెగ్యులేటర్ నుండి అనుమతి పొందడంతో, క్లినికల్ ట్రయల్ ఈ వారం వివిధ సైట్లలో ప్రారంభమయ్యిందనీ, ఈ ట్రయల్ 8-12 వారాల్లో పూర్తవుతుందని భావిస్తున్నట్లూ, ఆయన చెప్పారు.
భారతీయ అధ్యయనాలలో క్లినికల్ ట్రయల్స్ సమయంలో ఉత్పత్తి చేయబడిన విజయవంతమైన క్లినికల్ ఆధారాల ఆధారంగా, కోవిడ్-19 రోగులకు మరిన్ని చికిత్సా ఎంపికలు అందుబాటులో ఉండేవిధంగా అత్యవసర వినియోగ అధికారాన్ని కోరవచ్చు.