కార్పోరేషన్ లు ఏర్పాటు చరిత్రలో సువర్ణ అధ్యాయం..
మండపేట: అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చే విధంగా కమ్మ, రెడ్డి, క్షత్రియ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయమని వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు అన్నారు.
మండపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని సామాజికవర్గాల వారికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన ఘనత జగన్ కు దక్కుతుందన్నారు.
వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి కేవలం ఎస్సీ, బీసీ, కాపు తదితర కార్పొరేషన్లు మాత్రమే ఉండగా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆయా కార్పొరేషన్లలో ఉప కులాలతో ఇప్పటికే ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన ప్రభుత్వం అగ్రవర్ణాల వారికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుందున్నారు.
వీటి ద్వారా కమ్మ, రెడ్డి, క్షత్రియ సామాజికవర్గాల్లోని పేదలకు మేలు జరుగుతుందని పాపారాయుడు పేర్కొన్నారు.
కులాలతో నిమిత్తం లేకుండా పేదరికమే ప్రామాణికంగా పాలన సాగిస్తూ జగన్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పాపారాయుడు కృతజ్ఞతలు తెలిపారు.