సురుచి ఫుడ్స్ ఆధ్వర్యంలో..
108 సిబ్బంది కోవిడ్ రక్షణ సామగ్రి పంపిణీ..
మండపేట: కోవిడ్ విజృంభణ సమయంలో కూడా ఎంతో ధైర్యంగా ప్రజలకు సేవలనందిస్తున్న 108 అంబులెన్స్ సిబ్బందికి తాపేశ్వరం సురుచి ఫుడ్స్ 3 లక్షల రూపాయల విలువ చేసే సర్జికల్ గ్లోవ్స్, మాస్కులు, శానిటైజర్ లను అందజేసింది.
జిల్లాలో వున్న 68 అంబులెన్సుల సిబ్బందికి ఈ కిట్లను అందజేశారు. తాపేశ్వరం సురుచి ఫుడ్స్ ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమంలో రక్షణ కిట్లను పంపిణీ జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర మెడికల్ & హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పలివెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలంతా కోవిడ్ కు భయపడుతూ దూరంగా ఉంటున్నా తమ 108 సిబ్బంది మాత్రం ఎంతో సేవాభావంతో సేవలందిస్తున్నారు.
వారికి రక్షణ సామగ్రి అందజేయడం ఎంతైనా సముచితమని అంటూ అందుకు సురుచి అధినేత మల్లిబాబుకు కృతఙ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో సురుచి పిఆర్ఓ వర్మ, సురుచి మేనేజర్ శంకర్ కాకినాడ, రాజమండ్రి, మండపేట ల నుండి వచ్చిన 108 సిబ్బంది, సురుచి చీఫ్ కుక్స్ మల్లి, బప్పి తదితరులు పాల్గొన్నారు.