గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి కాకుండా నివారించాలి
శ్రీకాకుళం, మే 8 : గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా నివారించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు.
శనివారం టేలి కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ పట్టణాల్లో కేసుల పెరుగుదల కాకుండా కొంత మేర స్థిరత్వం వచ్చిందని, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాప్తి చెందే అవకాశం ఉందని అందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.
కర్ఫ్యూ సమయంలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించడం వలన కరోనా వ్యాప్తి కట్టడి చేయవచ్చు ఆయన అన్నారు.
కరోనా లక్షణాలు ఉన్న అందర్నీ సర్వే చేసి పరీక్షలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రైమరీ కాంటాక్ట్ పట్టుకోవాలని, వారికి పరీక్షలు అవసరం మేరకు నిర్వహించాలని సూచించారు.
కరోనా లక్షణాలు ఉన్న అందరికీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ హోమ్ ఐసోలేషన్ , హోమ్ క్వారంటీన్ ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని, వాటిని పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సిహెచ్ శ్రీధర్, టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, ఆర్డివోలు, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.