సిఐటీయూ ఆద్వర్యంలో లేబర్ కోడ్ ల దగ్దం
వరంగల్: ఈరోజు హన్మకొండ చౌరస్తా లో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ల ప్రతులను దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్మికులు బిజేపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని, నిత్యావసర వస్తువుల చట్ట సవరణలు ఆపాలని పెద్దపెట్టున నినదించారు.
ఈ సందర్భంగా సిఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, ఉపాద్యక్షులు వేల్పుల సారంగపాణి మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు విదేశీ బహుళ జాతి కంపెనీల లాభాల కోసం వెంపర్లు ఆడుతుంది అని తెలిపారు.
నవంబర్ 26న కార్మికులు దేశవ్యాప్త సమ్మె చేయడం జరిగింది. 25 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
2020 నవంబర్ 26 నుండి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని 500 రైతు సంఘాలు ఢిల్లీలో నాటి నుండి నేటి వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అయినా ఈ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు.
కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చినా లేబర్ కోడ్ లు యూనియన్ పెట్టుకునే హక్కును ఉండరాదని, ఎనిమిది గంటల పని 12 గంటలకు మార్చాలని సమ్మె హక్కు ఉండరాదని, జీతం పెంచుకునే హక్కు ఉండరాదని తెచ్చిన ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ రోజు లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేయడం జరిగిందని.
అందులో భాగంగా వరంగల్ హన్మకొండ చౌరస్తాలో లేబర్ కోడ్ ప్రతులు దగ్ధం చేశినట్లు సిఐటియు నాయకులు తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక,కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో ప్రజలంతా ఉద్యమించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు గండు సత్యం కృష్ణ నది రాజు నాగరాజు రమేశ్ అరవింద్ నగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.