కాకినాడ ఫిషింగ్ హార్బర్‌పై దృష్టి పెట్టండి: సీఎం జగన్
మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశం
అముల్ పాల సేకరణ ద్వారా మహిళా రైతులకు అదనంగా రూ.3.91 కోట్ల ఆదాయం
133 ప్రాసెసింగ్, ప్రిప్రాసెసింగ్ యూనిట్లు, ఆక్వాహబ్‌లకు దాదాపు రూ.646.90 కోట్లు వ్యయం
తొలి దశలో భాగంగా డిసెంబర్, 2022 నాటికి 4 ఫిషింగ్ హార్బర్లు పూర్తి
అమరావతి: అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులపై మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ మార్కెటింగ్, ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీడీడీసీఎఫ్), మత్స్యశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, పశు సంవర్థక విభాగాలలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించారు.
సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల మధ్య అనుసంధానం సమర్థవంతంగా ఉండాలి.
ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి. అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు ఏర్పాటు కావాలి. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి అని ఆదేశించారు.