మంత్రి సీదిరిపై కర్నూలు పోలీసులకు ఫిర్యాదు
ఈ రోజు కర్నూలు 1వ టౌన్ పోలీసు స్టేషనులో రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజుపై రవి కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
ఒక ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి అప్పలరాజు గారు కర్నూలులో N440K వైరస్ వ్యాప్తి చెందుతుందని అన్న విషయాన్ని పేర్కొన్నారు.
ఈ వైరస్ 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఇలా అనడం వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు అని, కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారని అయానపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఏ స్టేషనులో ఐతే కంప్లైంట్ ఇచ్చారో అదే 1 టౌన్ పోలీస్ స్టేషనులో ఈ కంప్లైంట్ ఇవ్వడం కొసమెరుపు.
