వరంగల్ అర్బన్: వరంగల్ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా మారుద్దామంటూ “అజాదీ కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమనికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సుందర్ రాజన్ గారికి సైకిలుపై వెళ్లి పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో స్వాగతం పలికిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్..
ప్రజల్లో పర్యావరణ సృహ పెంచడానికి, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలిగించడానికి సైకిల్
పై పర్యటనలు చేపడుతున్నట్లు పేర్కొన్న వినయ్ భాస్కర్.
గతంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు, అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు సైకిల్ పై వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఇటువంటి కార్యక్రమాల వలన పర్యావరణ కాలుష్యం తగ్గి, మన వరంగల్ నగరం ఆరోగ్య నగరంగా, హరిత నగరంగా మారుతుందని దాస్యం ఉద్ఘాటించారు.
పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతని ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు తెలియజేశారు.
ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మనిషి చేస్తున్న పనుల వల్ల భూగోళం అమితంగా వేడెక్కి పోతుందని కాబట్టి ధరిత్రి పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గత 13 సంవత్సరాలుగా ప్లాస్టిక్ వాడకానికి దూరంగా ఉంటున్నాని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
ఇకముందు కూడా ప్రతి నెలలో ఒకరోజు ఏసీ లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకాన్ని మానేస్తానని ప్రతిఙ చేశారు.
ఆధ్యాత్మిక, పర్యాటక, గ్రీన్ సీటిగా , వాహన కాలుష్య రహిత నగరంగా వరంగల్ నగరాన్ని మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
సైకిల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నాయని అన్నారు.
ప్రస్తుత హైటెక్ జీవితంలో సైకిల్ తొక్కడం అనేది చాలా మంది నామోషిగా భావిస్తున్నారనీ, ఇంటి నుండి బయట కాలు పెడితే కనీసం కాలనీలోనే ఉన్న కిరాణా షాప్‌కు వెళ్లాలన్నా వాయువేగంతో వెళ్లే మోటారు సైకిల్ లేదా కారు ఉపయోగిస్తున్నారని ఫలితంగా పెట్రోల్ వినియోగం విపరీతంగా పెరగడం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, తదితర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి వీటన్నింటికీ చెక్ పెట్టి సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే సైకిలింగ్ బెస్ట్ మార్గం అని అన్నారు.
స్వాతంత్ర భారతదేశం 75సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమన్ని గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకోవడంతో హైదరాబాద్ తో పాటు వరంగల్ నగరంలో కూడా కార్యక్రమన్ని ప్రారంభిస్తున్నందు గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి వరంగల్ ప్రజల పక్షాన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
గౌరవ గవర్నర్ గారు వరంగల్ నగర అభివృద్ధికి దోహదపడలాని కోరతూ అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమన్ని ప్రారంభించడానికి వరంగల్ నగరనికి విచ్చెసిన సందర్భంగా ఆత్మీయ స్వాగతం పలికారు.