ABN చానల్ పై బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఫిర్యాదు
ABN చానల్ పైన ఈ రోజు CID ప్రధాన కార్యలయం నందు, DGP ప్రధాన కార్యలయం నందు, హోమ్ మంత్రి క్యాంప్ కార్యలయం లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరుపున రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొల్లూరు శ్రీనువాసు శర్మ మరియు రాష్ట్ర క్రమశిక్షణ కమిటి వైస్ చెర్మన్ పై మూడు ప్రధాన కార్యలయంలో ఫిర్యాదు చెయ్యడం జరిగింది.
ఫిర్యాదు వివరాలు
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (209/1984) తరుపున రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొల్లూరు శ్రీనువాసు శర్మ మరియు తోలేటి రవీంద్ర ఫిర్యాదు చేసారు.
ఈ నెల 21వ తేదీన ABN చానల్ యూట్యూబ్ లో రామాయణ కాలంలో కరోనా ఉండు ఉంటే అంటూ లైవ్ లో ప్రశారం చేసిన కార్యక్రమం అభ్యంతరకరంగా ఉందని ఫిర్యాదులో పోర్కొన్నారు.
ఇ విడియో లో రామాయణం మరియు హిందువులు అరాధ్య దైవమైనా శ్రీరాముడుని, సీత ,లక్ష్మణుడు హనుమంతడు మెదలగువారిని తీవ్రంగా అవమానించడం జరిగిందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విడియో YouTube విడియో లింక్ ఇప్పుడు ఇప్పుడే WhatsApp మరియు face book లో వైరల్ అవుతున్నందు వలన మతకలహలుతోపాటు , హింస చలరేగడమే గాక ప్రజలులో భక్తి తగ్గి హిందువులు దేవాలయాలు పైన దాడి జరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
అంతేగాక గ్రాములులో జరిగే చిన్న చిన్న గొడవలను కుల గొడవలుగాను చిత్రికరించటం, Facebook లో వచ్చే వార్తలు నిజనిజాలు తెలుసుకోకుండా tv లో ప్రసారం చెయ్యడం. ABN చానల్ వచ్చే కొన్ని ప్రసారాలు ప్రజలు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే విధంగా ఉన్నాయన్నారు.
గతంలో దేవాలయాలు పైన దాడులు కుడా ప్రభుత్వం పైన దాడులకు ప్రేరేపించే విధంగా ప్రసారం చేసినట్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతంలో ముఖ్యమంత్రి క్రైస్తవుడని క్రైస్తవ్యాన్ని ప్రోత్సహిస్తున్నారని ఈ ఛానల్ గతంలో ప్రసారాలు కూడా జరిగేయన్నారు.
ప్రతిరోజూ ప్రభుత్వం పైన వ్యతిరేక ప్రచారం చేస్తు ప్రజలు ప్రభుత్వం పైన దాడిచేసే విధంగా కుట్రతో ఉన్న ఇ ABN చానల్ పైన హిందూ దేవుళ్లును కించపరుస్తుా చేసిన రామాయణంలో కరోనా ఖండ పేరుతో విడియోను అప్ లోడ్ చెయ్యడమే కాక , ఇదే లైవ్ స్ట్రీమ్ లో తూర్పగోదావరి జిల్లా ఆవులకు వింతవ్యాది వస్తే ఆవులపైన యాసిడ్ చల్లేరంటూ తప్పడు వార్త ప్రసారం చెయ్యడంతో హిందూ సంస్ధలు ఛలో రాజమండ్రి పిలుపు ఇవ్వడం జరిగిందని అన్నారు.
తరువాత పశుశాఖా వైద్యులు ఇది వింతవ్యాధి అని ప్రకటించడంతో ఛలో రాజమండ్రి పోస్ట్ డిలీట్ చెయ్యడం జరిగింది.
ఈ ప్రశారం లైవ్ స్ట్రీం చేసిన ఏబిఎన్ ఛానల్ అధినేత వేమూరి రాధాకృష్ణ పైన , విడియో YouTubeలో upload చేసిన వారిపైన , విడియోలో మాట్లాడిన యాంకర్ పైన, దానిలో నటించిన నటులు పైన ఈ కుట్ర పుారిత విడియో పైన క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చెయ్యవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
అంతేగాక ఇలాంటి అసత్య ప్రసారాలు చెయ్యడం, హిందూ దేవుళ్లుపైన కుట్రపూరిత ప్రసారాలు చెయ్యడం, ప్రభుత్వం పైన ప్రజలును ఉసి గోల్పేలా చెస్తన్న విడియోల వెనుక ఎవరున్నారో విచారించి, వారి పైన FIR నమోదు చేసి, వారిని అరెస్టు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ ప్రసారాలను శాశ్వతంగా నిలిపివెయ్యాలని లేనియడల కరోనా నియమాలు పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంస్ధలుతో కలపి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తాము అని కొల్లూరు శ్రీనువాసు శర్మ తెపిపారు.