కాబూల్: ప్రార్థనలు చేస్తుండగా మసీదులో బాంబు పేలడంతో 12 మంది చనిపోయిన సంఘటన కాబుల్ లో చోటుచేసుకుంది.
చనిపోయిన వారిలో మసీదు ఇమామ్ ముఫ్తీ నైమాన్ కూడా ఉన్నారు. ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్లో ఉన్న ఓ మసీదులో శుక్రవారం ఈ సంఘటన జరిగింది.
ప్రార్థనలు ప్రారంభమైన కొద్ది సమయానికే బాంబు పేలిందని, అయితే దీనిపై ఏ ఉద్రవాద/తీవ్రవాద సంస్థ కానీ స్పందించలేదని కాబూల్ పోలీసులు తెలిపారు.
అయితే ఇమామాన్ను టార్గెట్ చేసే బాంబు పెట్టారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ విషయమై మహిబుల్లాహ్ సాహేబ్జాదా అనే వ్యక్తి మాట్లాడుతూ ”నేను మసీదులోకి అడుగు పెడుతున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. మసీదు నుంచి పొగలు వస్తున్నాయి అని పేర్కొన్నాడు.