భక్త కన్నప్ప ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ఘనంగా ప్రారంభమైన శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి:- శ్రీకాళహాస్థీశ్వర స్వామివారి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శనివారంనాడు శాస్రోక్తంగా అత్యంత వైభవంగా శ్రీ భక్తకన్నప్ప ధ్వజారోహణం నిర్వహించారు.
భక్తకన్నప్ప స్వామివారిని ఆలయమందు ఉత్సవమూర్తుల మండపం నందు చక్కగా వివిధ రకాల పుష్పలతో, గజమాలలతో అలంకరించి మేళతాలతో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా భక్తకన్నప్ప స్వామివారి గిరిపైనకొలువు తీర్చిదిద్దారు.
అటు పిమ్మట శాస్రోక్తంగా కలిశానికి పూజలుచేసి స్వామివారి కోడిస్తంబానికి పూజలుచేసి ధ్వజారోహణం నిర్వహించి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక హారతులు అందించారు.
ఈ వేడుకలను భక్తులు అధికసంఖ్యలో పాల్గొని తిలకించారు.
నేడు మాఘ బహుళ అష్టమి నుండి శ్రీకాలహాస్టశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు 13రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
అందులో భాగంగా ఈరోజు శ్రీ భక్తకన్నప్ప స్వామివారి ధ్వజారోహణం నిర్వహించబడింది.
ఈ భక్త కన్నప్ప పూర్వజన్మమున అర్జునుడని, శాపంవలన ఈ జన్మలో బోయవానిగా జన్మించి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలుచేసి తన నేత్రాలను సైతం స్వామి వారికి సమర్పిస్తాడు.
తన భక్తికి మెచ్చిన శ్రీకాలహాస్టశ్వరుడు తన క్షేత్రంలో మొదటి ప్రాధాన్యత భక్తుడికి ఇవ్వడంజరిగింది కావున స్వామివారికి జరిగే కైంకర్యాలలో మొదటగా భక్త కన్నపనే పూజిస్తారు.
కావున ఈ క్షేత్రంలో ఎవరైతే స్వామివారిని భక్తి శ్రద్ధలతో పుజిస్తారో వారికి పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహం తప్పక కలుగుతుంది అని ఇక్కడి స్థలపురాణం చెప్తుతుంది