బ్యాంక్ ఉద్యోగుల ధర్నా…
మండపేట:-బ్యాంక్ లు ప్రయివేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్రను అడ్డుకోకపోతే భవిష్యత్లో సామాన్యుడు కి బ్యాంక్ లు అందని ద్రాక్షాగా మిగిలిపోయే పరిస్థితులు వస్తాయని యూఎఫ్ బి యు నాయకులు పొన్నగంటి చంటి కుమార్ పేర్కొన్నారు.
బ్యాంకుల ప్రయివేటీకరణను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన రెండు రోజుల బందులో భాగంగా మండపేట స్టేట్ బాంక్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు ధర్నాలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంక్ ఉద్యోగులు సుబ్రహ్మణ్యం , ఆకుల సాంబశివరావు, కొంపెళ్ళ గణేష్, వేగుళ్ల విజయలక్ష్మి, మంగిపూడి పావని, పిల్లి నాగేంద్ర వేణి, అవసరాల ధర్మరాజు, చెరుకూరి పైడి వెంకట వాసుదేవరావు, నార్కెడుమిల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.