ఐపీఎస్‌లు క్రిమినల్స్‌గా మారుతున్నారు: బండి సంజయ్
ఆదిలాబాద్: ఐపీఎస్‌లు క్రిమినల్స్‌గా మారుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం జిల్లా జైలులో భైంసా అల్లర్లలో అరెస్టు అయిన కార్యకర్తలతో ములాఖత్ అయ్యారు. కార్యకర్తలను పరామర్శించారు.
ఈసందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. భైంసా అల్లర్లపై జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
పోలీసులు అసలు నిందితులను వదిలేసి తమను అక్రమంగా అరెస్టు చేశారని కార్యకర్తలు మొరపెట్టుకున్నారు.
భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ పరంగా పూర్తిగా అండగా ఉంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
తమ కార్యకర్తలను పోలీసులు హింసించారని మండిపడ్డారు. అమాయకులను భయభ్రాంతులకు గురి చేసి, బెదిరించి కేసులు పెట్టారని పోలీసుల వైఖరీపై ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్‌కు మానవత్వం లేదన్నారు. ఓవైసీ కోసం కేసీఆర్ హిందువులను బలి చేస్తున్నడని మండిపడ్డారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కొడుక్కు అదే గతి పట్టిస్తామని హెచ్చరించారు.
భైంసా దారుణాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.
ప్రవీణ్ కుమార్‌పై ఫైర్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసు అధికారులే హిందు మతానికి వ్యతిరేకంగా సంస్థలు నడుపుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
ఒక ఐపీఎస్ అధికారి ఆధారాలతో సహా దొరికితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
ఆసంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.