ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు కంచర్ల జిల్లా మృతి..
పలువురు సంతాపం..
మండపేట:- ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు కంచర్ల మాణిక్యాలరావు(జిల్లా)(50) ఆకస్మికంగా మృతి చెందారు.
శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కాకినాడ తరలించారు. పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీఘకోళాపు శివ రామ సుబ్రహ్మణ్యం తదితరులు ఆయనను హైదరాబాద్ తరలించాలని ప్రయత్నించారు. కాగా మానసికంగా ఒత్తిడి అధికం కావడంతో రాత్రి తుదిశ్వాస విడిచినట్టు బంధువులు తెలిపారు.
1972 మే 8 న జన్మించిన ఆయన, అంచెలంచెలుగా ఎదిగి జిల్లా ఆర్యవైశ్య వర్గంలో పట్టు సాధించారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు శిష్యుడిగా ఉండేవారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జిల్లా మండపేట నియోజకవర్గ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. అనంతరం టిడిపిలో చేరి, కొద్దీ రోజులు క్రితమే వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
మండపేట బిల్డింగ్ మెటీరియల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా, ది వైశ్య యూత్ వ్యవస్థాపకులుగా సేవలు అందించారు.
జిల్లా మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. జిల్లా మృతి పట్ల మండపేట అసెంబ్లీ నియోజకవర్గం తోట త్రిమూర్తులు, మండపేట టిడిపి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సంతాపం ప్రకటించారు.
టిడిపి యువ నాయకులు వి. కుమార్ బాబు, బిజెపి కన్వీనర్ కోన సత్యనారాయణ, జనసేన పార్టీ ఇన్చార్జి వేగుళ్ల లీలా కృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, సంతాపం వ్యక్తం చేశారు.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్ధించారు.