టెన్త్,ఇంటర్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి
అమరావతి: టెన్త్ ఇంటర్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యా శాఖ మంత్రి సురేష్ తెలియజేశారు. కరోనా నేపథ్యంలో ముందస్తు షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షలను నిర్వహిస్తున్నమని ఆయన తెలిపారు.
పలు రాష్ట్రాలు పరీక్షలను నిర్వహించి పూర్తి చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు.
జూన్ 1 నుంచి ఉపాధ్యాయులు స్కూల్ కు రావాలని త్వరలో ఇంటర్, టెన్త్ టైంటేబుల్ వెల్లడిస్తామని ఆయన తెలిపారు.