రాష్ట్ర నేషనల్ క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంట్ రెవ.అభిలాష్ సన్నీ మృతి
నెల్లూరు జిల్లా.. కోట మండలంలోని విద్యానగర్ గ్రామానికి చెందిన హొలీ ప్రేయర్ చర్చి అధినేత,రాష్ట్ర నేషనల్ క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంట్ రెవ.అభిలాష్ సన్నీ ( 34) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.
ఇటీవల రెవ.అభిలాష్ సన్నీ కోవిడ్ బారిన పడడంతో హైదరాబాద్ లోని ఓ ప్రేవేట్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్న తరుణంలో ఆదివారం వేకువజామున రెవ.అభిలాష్ సన్నీ అకాల మరణం చెందారు.
హైదరాబాద్ నుండి రెవ.అభిలాష్ సన్నీ పార్ధీవ దేహాన్ని విద్యానగర్ కు తీసుకొని వస్తున్నారు.
ఈ రోజు సాయంత్రం విద్యానగర్ లో అంత్యక్రియలు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
రెవ.అభిలాష్ సన్నీ చిన్నప్పటి నుండి క్రీస్తువుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు, గ్రామ స్థాయి నుండి ఆంద్రప్రదేశ్ నేషనల్ క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు.
భారత దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రెవ.అభిలాష్ సన్నీ ఎన్నో కార్యక్రమాలలో పాల్గున్నారు.
బ్రదర్ అనిల్ తో ఎంతో సన్నిహితులు ఉండేవారు, అలాంటి రెవ.అభిలాష్ సన్నీ మృతి చెందడంతో క్రైస్తవ సంఘాలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.