కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో ఉగ్రరూపం దాలుస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ కాబినెట్ మంత్రి పలాస నియోజికవర్గ ఎంయెల్యే సీదిరి అప్పలరాజు తమ కార్యాలయానికి తాత్కాలికంగా సెలవలు ప్రకటించారు.
రేపటి నుండి అధికారిక కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండనున్నట్లు వారు ఈ సందర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే అత్యవసర సందర్భంలో తమ అవసరం ఉన్న వారు నిస్సందేహంగా తమ వ్యక్తిగత సహాయకులను సంప్రదించవలసిందిగా కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో తమ వ్యక్తిగత సహాయకులను 9395523455 లేదా 9396623466 నంబర్లలో ఫోన్ ద్వారా సంప్రదించాల్సిందిగా కోరారు.