ఏలూరు జేవియర్ నగర్ లో “యాంటీ డ్రగ్ డ్రైవ్ ” పై అవగాహనా కార్యక్రమం ఏలూరు 3 టౌన్ పోలీసులు నిర్వహించినారు.
ఈ రోజు 23.06.2021వ తేదిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి నారాయణ్ నాయక్ ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు ఏలూరు డిఎస్పీ డాక్టరు దిలీప్ కిరణ్ గారు యొక్క ఆదేశాలపై యాంటి డ్రగ్స్ కార్యక్రమమును ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ వర ప్రసాద్ గారి అధ్వర్యంలో ఎస్ఐ ప్రసాదు గారు ఏలూరు జేవియార్ నగరులో మాదక ద్రవ్యాలు వినియోగము వలన కలిగే అనర్థాలను గురించి ప్రజలకు అవగాహనా కార్యక్రమం చేపట్టారు
ఈ కార్యక్రమములో ఏలూరు 3 టౌన్ ఎస్ఐ ప్రసాద్ గారు మాట్లాడుతూ మాదకద్రవ్యాల వ్యసనం యువతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని, మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.
మత్తు పదార్థాలకు అలవాటుపడితే జ్ఞాపకశక్తి క్షీణించడం, ఏకాగ్రత లోపించడం, పక్షవాతం రావడం, తదితర దుష్ఫరిణాలు తలెత్తి జీవితమే నాశనమయ్యే ప్రమాదముంటుందని అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు మాదక ద్రవ్యాల జోలికెళ్ల రాదని మాదక ద్రవ్యాల విక్రయించే వారి యొక్క సమాచారము పోలీస్ వారికి తెలియ చేసిన వారి యొక్క వివరములు గొప్యము గా ఉంచుతము అని ప్రజలకు తెలియచేసి నారు