మీడియా మిత్రుల కు చిరు సూచన
✍️✍️✍️✍️✍️✍️
మీ కుటుంబాలకు మీ అవసరం ఎంతో ఉంది.
✍️✍️✍️✍️✍️✍️✍️
భౌతికదూరం పాటిస్తే ..కుటుంబానికి భౌతికంగా దూరమవ్వం
బ్రేకింగ్ న్యూస్ వేట మానేస్తే.. అయినవాళ్లకు షాకింగ్ న్యూస్ ఇవ్వం
ఆలోచించండి
––––––––––––––
నమస్కారాలకు ఎడిక్ట్ అయిపోయాం
ఛాయ్ బిస్కెట్లతో కడుపునింపు కుంటున్నం
దావత్ అంటే సంబరం చేసుకుంటున్నం
జీవితం సరదాగా సాగిపోతుందనుకుంటున్నాం
ఇంట్లో పెళ్లాం పిల్లల్ని మరిచిపోయి సమాజం మీద తిరుగుతున్నం
ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పెద్ద పెద్ద వాళ్ల ఫోన్లు
జీవితం బిజీ బీజి… జేబు ఖాళీ ఖాళీ
జీతం లేని బిజీ ఉద్యోగం
ఇంటిలో బయలుదేరిన నుంచి తిరిగి ఇంటికిచేరేవరకు
ఎత్తిన చేయి దించకుండా నమస్కారాలు
నిత్యం బ్రేకింగ్ న్యూస్, హాçట్ న్యూస్ అంటూ పరుగులు పెడుతున్నం
యవ్వనం, వయసు అంతా కరగతీస్తున్నం
కాళ్లు కుంగినపుడో ..కాలం అడ్డం తిరిగినపుడో వెనక్కు చూస్తున్నం
ఏముంది? వెనక్కు చూస్తే .. ఇంట్లో ఆశగా ఎదురు చూసే పిల్లలు
బయటకు చెప్పక కుటుంబభారాన్ని మోస్తున్న భార్య
కలో గంజో తాగుతున్నం… కాలం వెళ్లదీస్తున్నం
కానీ….
కరోనా కాటు వేస్తోంది
కలో గంజికి కూడా లేకుండా చేస్తోంది
తల్లిని బిడ్డను వేరు చేస్తోంది
ఆలిని అమ్మను దూరం చేస్తోంది
బంధాలనే తెంచేసి బయటపడేస్తోంది
మిత్రులారా ఆలోచించండి
–––––––––––––––––––
కరోనా అంటే కన్నెత్తి చూడరు..
ఫోన్లు చేసి న్యూస్ చెప్పే నాయకులు
సలాం చేసే అధికారులు
ధావత్ ఇస్తామన్న కాంట్రాక్టర్
ఛాయ్ బిస్కెట్ ఇచ్చే చోటా లీడర్
ఏ ఒక్కరూ కానరావడం లేదు
ఆలోచించండి
పరుగు ఆపండి
కరోనా బారిన పడకుండా కాపాడుకోండి
బయట మనమేం చేస్తున్నామో తెలియని …మనల్నే నమ్ముకుని ఉన్న భార్యా పిల్లలకు దూరం కాకండి
వాట్సాప్ వైద్యాలు మానండి
స్నేహితుడు చెప్పే ఆకు వైద్యం వీడండి
వ్యాక్సిన్‌పై అపోహలు వీడండి
ముందుగా మాస్క్ ,శానిటైజర్,భౌతిక దూరం పాటించండి
ఎందుకంటే మొన్న ప్రభు, నిన్న ts సాయి, నేడు చిన్నారావు రేపు ఎవరో?
ఎవరి వంతు వస్తుందో ..
మహమ్మారి ఏ మిత్రుడి కుటుంబాన్ని కబళిస్తోందో
చేతిలో మాస్క్ శానిటైజర్ పెట్టుకుని బ్రేకింగ్ న్యూస్‌లకు దూరంగా ఉంటే
కుటుంబానికి షాకింగ్ న్యూస్ ఇవ్వం
భౌతికదూరం పాటిస్తే ……
అయినవాళ్లకు భౌతికంగా దూరమవ్వం
Be safe
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏