తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం పెదపళ్ళ గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఏడిద సత్యశ్రీ మెహర్ ప్రసాద్ ఎన్నికయ్యారు.
కొత్తపేట యం.ఎల్.ఏ. మరియు పియుసి చైర్మెన్ చిర్ల జగ్గిరెడ్డి ఆశీస్సులతో నెక్కంటి బుజ్జి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ నుండి అత్యధిక ఓట్ల మెజార్టీతో అఖండ ఘన విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థి ఏడిద సత్యశ్రీ మెహర్ ప్రసాద్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.
ముందుగా దళిత వాడలో అంబేడ్కర్, బాబు జగజ్జివనరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి గ్రామసచివాలంలో ప్రమాణస్వీకారం చేశారు.
అనంతరం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలు తమపై నమ్మకం ఉంచి సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేసి తమపై గ్రామస్థులు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు.
పంచాయితీని అభివృద్ధి బాటలో నడిపించి తాను గ్రామాభివృద్ధికి తోడ్పడతానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని అన్నారు.
గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెయ్యాలనే ధృడ సంకల్పంతోనే సర్పంచ్ అభ్యర్ధిగా బరిలోకి దిగానని, ప్రజల ఆశీస్సులతో తాను విజయం సాధించానని గ్రామప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం సర్పంచ్ తో పాటు వైస్ సర్పంచ్ అభ్యర్థి గొడవర్తి అనురాధ దేవి, వార్డు మెంబర్లును గ్రామ పెద్దలు శాలువాలు, పూలమాలలతో సత్కరించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గొడితి వెంకన్న, యల్ ఐ సి వెంకటేశ్వరరావు, గొడవర్తి నాగేశ్వరరావు, సలాది నాగేశ్వరరావు, గొడితి బాబి, చిలుకూరు నాగేశ్వరరావు, గంటా రామారావు, గంటా సూరిబాబు, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.