అందరి సహకారంతోనే స్థానిక ఎన్నికలు సజావుగా సాగాయి. ఎస్ఈసీ, నిమ్మగడ్డ రమేశ్ కుమార్
గెలిచిన వారిలో కేవలం 16 శాతం మాత్రమే ఏకగ్రీవం.
50 శాతం మంది మహిళలలు, బలహీనవర్గాల వారు.
ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా జరగలేదని, అన్ని వర్గాల వారూ సంయమనంతో ఉండటంతోనే ఇది సాధ్యపడిందని పేర్కొన్న నిమ్మగడ్డ. మొత్తం 13,097 స్ధానాలకు ఎన్నికలు జరగగా, 16 శాతమే మాత్రమే ఏకగ్రీవం అయ్యాయని ఆయన తెలిపారు. 10,890 మంది సర్పంచులు నేరుగా పోటీ చేసి ఎన్నికకాగా, వారిలో, 50 శాతం మంది మహిళలు, బలహీనవర్గాల వారు ఉన్నారు.
గెలిచిన వారి వల్ల మెరుగైన నాయకత్వం వ్యవస్ధకు వస్తుందని ఎస్ఈసీ ఆశిస్తోందని ఆయన పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది వ్యాక్సినేషన్ పక్కన పెట్టి పనిచేయగా, 80 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆరోగ్యశాఖ కోవిడ్ నేపధ్యంలో చక్కని ఏర్పాట్లు చేసినట్లు, ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
డీజీపీ, సీఎస్ కూడా సమయానుకూలంగా సూచనలిస్తూ పనిచేసినట్లు, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు.
కోర్టు అవరోధాలు కూడా తొలిగిపోతే, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా ప్రభుత్వంతో సంప్రదించి నిర్వహిస్తామని, మునిసిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటటర్లు కచ్చితంగా ఓటు వినియోగించుకుంటారని ఆశాభావం వ్యక్తపరిచారు.
ఉదయం 7 గంటల నుండి సాయమత్రం 5 గంటల వరకూ మునిసిపల్ పోలింగ్ ఉంటుంది అని ఈ సందర్భంగా రమేశ్ కుమార్ తెలిపారు.
ఇవాళ డీజీపీ, మరియు సీఎస్ ల సమక్షంలో కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్, అభర్ధులు ఎవరైనా నామినేషన్ వేయలేకపోయినట్లు అయితే, వారు రుజువులతో సహా సంబంధిత జిల్లా కలెక్టర్లను సంప్రదిస్తే నామినేషన్ స్వీకరిస్తారని తెలిపారు. హైకోర్టు సూచనలు ఎన్నికల ప్రక్రియకు సంబంధించినవని ఆయన తెలిపారు.