కాకినాడ సెజ్ భూముల్లో 2,180 ఎకరాలు తిరిగి రైతులకే
కాకినాడ సెజ్ కోసం గత ప్రభుత్వం రైతులనుండి బలవంతంగా లాక్కున్న 2,180 ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసిన రాష్ట్ర క్యాబినెట్. పాద యాత్రలో రైతుల ఆవేదనను తెలుసుకున్న జగన్ అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తానని ఆ నాడు పాద యాత్రలో ఉండగానే రైతులకు మాటి ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక, ఉన్న అడ్డంకులన్నింటిని అధిగమించి గత ప్రభుత్వం బలవంతంగా లాక్కున్న 2,180 ఎకరాలను రైతులకే తిరిగి ఇచ్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ విధంగా 15 ఏళ్ళుగా నెలకొన్న సమస్యకు జగన్ చొరవతో పరిష్కారం లభించింది.