డయల్ యువర్ కలెక్టర్ కు 18 వినతులు
శ్రీకాకుళం, ఏప్రిల్ 26 : డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 18 వినతులు అందాయి.
కరోనా కారణంగా సోమవారం నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేసి ప్రజల సమస్యలను, ఫిర్యాదులను డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు.
అందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 18 మంది ఫోన్ కాలర్స్ తమ సమస్యలను, ఫిర్యాదులను ఫోన్ చేసి తెలిపారు.
ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామం నుండి బి.కృష్ణారావు ఫోన్ చేస్తూ ఎం.పి.డిఓ గారి నాలుగు కుట్టు మిషన్లు , ఒక వాసింగ్ మిషన్ ను మంజూరు చేయాలని కోరారు.
హిరమండలం నుండి టి.శంకరరావు ఫోన్ చేస్తూ ఉపాధిహామీ జాబితాలో తన కుమారుడు పేరు బదులుగా వేరే పేరు అనగా సాయికుమార్ పేరు నమోదయిందని ఆపేరును సరిచేయవలసిందిగా కోరారు.
నరసన్నపేట మండలం కోమర్తి గ్రామం నుండి టి.శారద ఫోన్ చేస్తూ సర్వే నెంబరు 225/4 -075 సెంట్లు పాస్ బుక్కులో వేరే వారి పేరు నమోదయిందని వాటిని మార్పు చేయాలని కోరారు.
శ్రీకాకుళం మండలం నుండి కె.మల్లేశ్వరరావు ఫోన్ చేస్తూ కమల నివాస్ దగ్గర్లో నివాసం ఉంటున్నందునా , తన పెన్షన్ ను శ్రీకాకుళం కు ట్రాన్సఫర్ చేయాలని కోరారు.
కవిటి మండలం మాణిక్యపురం నుండి డి.బిశాయ్ ఫోన్ లో మాట్లాడుతూ తమ గ్రామ పంచాయితీ స్కూల్ గ్రౌండులో సచివాలయ నిర్మాణం జరుగుతున్నందున వాటిని నిలుపుదల చేయాలని కోరారు.
శ్రీకాకుళం మండలం బలగ నుండి టి.లక్ష్మి ఫోన్ చేస్తూ పట్టాదారు పుస్తకం మంజూరు చేయాలని కోరారు. భామిని మండలం కేసరి గ్రామ మండి వై.చిన్నమ్మడు ఫోన్ చేస్తూ సి.ఎం రిలీఫ్ పండును మంజూరు చేయాలని కోరారు.
మిళియాపుట్టి మండలం కొసమాల గ్రామం నుండి ఎస్.జ్జానేశ్వరరావు ఫోన్ లో మాట్లాడుతూ స్కూల్ ప్రహారి గోడ నిర్మాణ బిల్లు ను మంజూరు చేయాలని కోరారు.
రాజాం మండలం నుండి 8 వ వార్డు నుండి ఎస్ .మదీన్ ఫోన్ చేస్తూ తమ స్థలంలో ఉన్న మామిడి చెట్లులను కొట్టివేశారని ఫిర్యాదు చేస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
నరసన్నపేట మండలం నుండి ఎన్. గణేష్ ఫోన్ చేస్తూ వైయస్.ఆర్ జలకళ మంజూరు చేయాలని కోరారు. జలుమూరు మండలం చిన్న దుగాం నుండి ఇ.పద్మావతి ఫోన్ చేస్తూ ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరారు.
హిరమండలం నుండి అంతిలి గ్రామం నుండి ఎ. అప్పలనాయుడు ఫోన్ చేస్తూ తనకు రైతు భరోసా మంజూరు చేయాలని కోరారు.
జలుమూరు మండలం శ్రీముఖలింగం నుండి నాయుడుగారు రాజశేఖరు ఫోన్ చేస్తూ తమ గ్రామంలో కాలువలు శుభ్రపరచుట లేదు , కాలువ పై కప్పులను వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు బి.భాస్కరరావు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.